Shodasa Kalanidhiki In Telugu

॥ Shodasa Kalanidhiki Telugu Lyrics ॥

షోడసకళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥

అలరు విశ్వాత్మకున కావాహన మిదె సర్వ
నిలయున కాసనము నెమ్మినిదే ।
అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే ॥

వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె
సరి శ్రీమంతునకు భూషణము లివే ।
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు
తిరమిదె కోటిసూర్యతేజునకు దీపము ॥

అమృతమథనునకు నదివో నైవేద్యము
గమి(రవి)జంద్రునేత్రునకు కప్పురవిడెము ।
అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి
తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Shodasa Kalanidhiki Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Sri Durga Stotram (Arjuna Krutam) In Tamil