Abbabba Debbalaku Talalera – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Abbabba Debbalaku Talalera Lyrics ॥

అసావేరి – ఆది

పల్లవి:
అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా రామప్ప గొబ్బున నన్నేలుకోరా అ ॥

చరణము(లు):
మేలుచేయుదు నంటిగదరా మేలుచేసితినేమి భయమంటి గదరా
వరహాలు మొహరీలు జమజేస్తిగదరా నీ పరిచారకులకు నే పెట్టితిగదరా అ ॥

పరులకొక్కరువ్వ యీయలేదుగదరా ఓ పరమాత్మ నీ పాదముల్‌ నమ్మితిరా
కొరడాలు తీసుక గొట్టిరిగదరా హరనుత గోవింద హరితాళలేరా అ ॥

అంతటిలో నిన్ను నెరనమ్మినారా శరణాగత గోవింద హరితాళలేరా
శరధిబంధించిన శౌర్యమెక్కడరా రాక్షససంహార రక్షింపరారా అ ॥

రామ భద్రాద్రిసీతారామ రామా నీనామమెప్పుడు భజియించితిగదరా
రామదాసుని నిటుల చేయించితేరా అ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Ennaganu Ramabhajana In English – Sri Ramadasu Keerthanalu