Adugu Dati Kadala In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Adugu Dati Kadala Lyrics ॥

వరాళి – రూపక (-త్రిపుట)

పల్లవి:
అడుగుదాటి కదలనియ్యను నాకభయ మియ్యక నిన్ను విడువను అ ॥

అను పల్లవి:
గడియగడియకు తిరిగితిరిగి యడిగితిని వేసారవచ్చెను
గడువుదప్పిన నేను నిక బహు దుడుకుతనములు సేయుదును నిను అ ॥

చరణము(లు):
కుదురుగా గూర్చుండనియ్యను కోపమొచ్చిన భయము చెందను
మది నెరింగి యుండుమిక మొగమాటమేమియు లేదుగద నా
హృదయ కమలమునందు నీ మృదు పదములను బంధించివేతును అ ॥

రేపు మాపని జరిపితే నే నాపుజేసెడివాడ గాను
ప్రాపు నీవని నమ్మిగొలిచిన పాపముల నెడబాపి దయతో
తేపతేపకు నీదు మోమిటు చూపకుండిన నోర్వసుమ్మి అ ॥

పతితపావన బిరుదులేదా పాలనము నను సేయరాదా
ప్రతిదినంబును దేవ నిను భూపతి వటంచును వేడినను నీ
హితజనంబులు వచ్చి నన్ను బ్రతిమాలినను విడబోను నిన్ను అ ॥

రాక్షసాంతక భక్తవరదా సారసాక్ష సుజనరక్షక
యీ క్షణంబున దీనజనుడని మోక్షమియ్యక యుంటివా నిను
సాక్షి బెట్టియు నేడు నేనొక దీక్షచే సాధింతు నిన్ను అ ॥

భూరి భద్రాచలనివాసా భుజగశయనా భక్తపోష
కూరిమిగ నిను విడిచిపెట్టిన ధరణిలో భద్రాద్రి రాఘవ
రామదాసుం డనెడి నామము మారుపేరున బిలువు నన్ను అ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Shadanana Stuti In Telugu