Sri Lalitha Chalisa In Telugu

॥ Lalitha Chalisa in Telugu Lyrics ॥

॥ శ్రీ లలితా చాలీసా ॥
లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం ॥ ౧ ॥

హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప
చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం ॥ ౨ ॥

పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా
హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి ॥ ౩ ॥

శ్వేతవస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి ॥ ౪ ॥

నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిబిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు ॥ ౫ ॥

కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు ॥ ౬ ॥

శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమత్ త్రిపురసుందరిగా
సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీమహాలక్ష్మిగ రావమ్మా ॥ ౭ ॥

మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో
మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి ॥ ౮ ॥

పసిడి వెన్నెలా కాంతులలో పట్టువస్త్రపుధారణలో
పారిజాత పూమాలలో పార్వతి దేవిగా వచ్చితివి ॥ ౯ ॥

రక్తవస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్దినివైనావు ॥ ౧౦ ॥

కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి
కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి ॥ ౧౧ ॥

రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగ
రమావాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు ॥ ౧౨ ॥

ఖడ్గం శూలం ధరియించి పాశుపతాస్త్రం చేబూని
శుంభ నిశుంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా ॥ ౧౩ ॥

See Also  108 Names Of Ganapati Gakara In Telugu

మహామంత్రాధిదేవతగా లలితాత్రిపురసుందరిగా
దారిద్ర్య బాధలు తొలిగించి మహదానందము కలిగించే ॥ ౧౪ ॥

అర్తత్రాణపరాయణివే అద్వైతామృత వర్షిణివే
ఆదిశంకరా పూజితవే అపర్ణాదేవి రావమ్మా ॥ ౧౫ ॥

విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి ॥ ౧౬ ॥

ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి
ఆదిప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ ॥ ౧౭ ॥

దక్షుని ఇంట జనియించి సతీదేవిగ చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ ॥ ౧౮ ॥

శంఖు చక్రమును ధరియించి రాక్షస సంహారమును చేసి
లోకరక్షణ చేసావు భక్తుల మదిలో నిలిచావు ॥ ౧౯ ॥

పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగ
చిరునవ్వులను చిందిస్తూ చెరకు గడను ధరయించితివి ॥ ౨౦ ॥

పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమథగణములు కొలువుండ కైలాసంబే పులకించే ॥ ౨౧ ॥

సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా
మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి ॥ ౨౨ ॥

మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరియై
అంకుశాయుధ ధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబ ॥ ౨౩ ॥

సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది
శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి ॥ ౨౪ ॥

మహామేరువు నిలయనివి మందార కుసుమమాలలతో
మునులందరు నిను కొలవంగ మోక్షమార్గము చూపితివి ॥ ౨౫ ॥

చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే ॥ ౨౬ ॥

See Also  Sri Bhadrakali Ashtottara Shatanama Stotram In Telugu

అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ అతిసుందరము నీ రూపం ॥ ౨౭ ॥

అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా
జ్ఞానప్రసూనా రావమ్మా జ్ఞానమునందరికివ్వమ్మా ॥ ౨౮ ॥

నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు ॥ ౨౯ ॥

రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి ॥ ౩౦ ॥

అరుణారుణపు కాంతులలో అగ్ని వర్ణపు జ్వాలలలో
అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి ॥ ౩౧ ॥

గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి ॥ ౩౨ ॥

పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికీ మాతవుగా
అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి ॥ ౩౩ ॥

కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ॥ ౩౪ ॥

ఏ విధముగా నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను
మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగ కాపాడు ॥ ౩౫ ॥

మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి
మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి ॥ ౩౬ ॥

త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమవునా ॥ ౩౭ ॥

ఆశ్రితులందరు రారండి అమ్మరూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము ॥ ౩౮ ॥

See Also  Darisanamayenu Sriramulavari In Telugu – Sri Ramadasu Keerthanalu

సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి
సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు ॥ ౩౯ ॥

మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము ॥ ౪౦ ॥

– Chant Stotra in Other Languages –

Sri Lalitha Chalisa Lyrics in English