Sri Venkateswara Suprabhatam In Telugu

Suprabhatam, which is translated as “auspicious dawn”, is a collection of hymns or verses recited early in the morning to awaken the deity every day.

The Venkateswara Suprabhatam was composed around 1430 A.D. by Pratvada Bhayankara Sri Anantacharya, who is also known as Anangaracharyar.

Sri Venkatesa Suprabhatam consists of four parts they are Suprabhatam, Sri Venkatesa Stothram, Prapatti, and Mangalasasanam.

॥ Venkateswara Suprabhatam Telugu Lyrics & Meaning ॥

 ॥ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం ॥ 
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ ॥ 1 ॥

తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము.

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ

ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥

తా. ఓ గోవిందా! లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా! లెమ్ము. ఓ లక్ష్మీవల్లభా ! లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములు కలిగింపుము.

మాతః సమస్త జగతాం మధుకైటభారే:

వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే

శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌ ॥ 3 ॥

తా. సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక.

తవ సుప్రభాత మరవిందలోచనే

భవతు ప్రసన్న ముఖచంద్రమండలే

విధిశంకరేన్ద్ర వనితాభిరర్చితే

వృషశైలనాద థయితే దయానిధే. ॥ 4 ॥

తా. కమలములను పోలు కన్నులును, చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖమును గల ఓ లక్ష్మీదేవీ! నిన్ను సరస్వతి, పార్వతి, శచీదేవి పూజించుచుందురు. శ్రీవేంకటేశ్వరుని సతీమణివి, దయానిధివి అగు నీకు సుప్రభాతమగు గాక.

అత్ర్యాధిసప్తఋషయస్య ముపాస్య సంధ్యాం

ఆకాశ సింధు కమలాని మనోహరాణి

ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్‌ ॥ 5 ॥

తా. అత్రి మున్నగు సప్తమహర్షులను తమ చక్కని సంధ్యావందనమును ముగించి, ఆకాశగంగ యందలి చక్కని కమలములను తెచ్చి నీ పాదములను చూజించుటకు వచ్చియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా:

త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి

భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్‌

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 6 ॥

తా. శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ అద్భుత చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నీ దగ్గరగా ఉండి నేటి తిథివారాదుల ఫలములను చదువుచున్నాడు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

ఈషత్ర్పఫుల్ల సరసీరుహ నారికేళ

పూగద్రుమాది సుమనోహర పాళికానాం

ఆవాతి మందమనిల స్సహ దివ్యగంధైః

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 7 ॥

తా. కొంచెం వికసించిన తామరపూల యొక్క, కొబ్బరి, పోక మున్నగు చెట్ల అందమైన మోవుల యొక్క సువాసనలతో మలయమారుతము మెల్లగా వీచుచున్నది. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

See Also  Sri Gokul Ashtakam In Telugu

ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః

పాత్రావశిష్ట కదలీఫల పాయసాని

భుక్త్వా సలీలమథ కేళిశుకాః పఠంతి

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 8 ॥

తా. ఓ శేషశైలపతీ! చక్కని పంజరములలో వున్న పెంపుడు చిలుకలు తా మిదివరకు కొంత భక్షింపగా పాత్రలలో మిగిలియున్న అరటిపండ్లను, పాయసమును తిని వాలాసముగా పాడుచున్నవి. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక!

తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా

గాయన్త్యనంత చరితం తవ నారదో7పి

భాషాసమగ్ర మసకృత్కర చారురమ్యం

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 9 ॥

తా. ఓ అనంతా! నారదుడు కూడ మధురముగా ధ్వనిచేయు తన వీణ తీగలను మీటుచు, పెక్కు సారులు రమ్యముగా హస్తాభినయముచేయుచు, చక్కని భాషతో నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు. ఓ శేషశైలాధీశా! నీకు సుప్రభాతమగు గాక.

భృంగావళీచ మకరంద రసానువిద్ధ

ఝంకారగీత నినదైః సహ సేవనాయ

నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యః

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 10 ॥

తా. మకరందమును త్రాగి విజృంభించిన తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించుటకై సమీప సరస్సులలోని కమలములనుండి బయలువెడలి వచ్చుచున్నవి. ఓ శేషాచలపతీ! నీకు సుప్రభాతమగు గా.

యోషాగణేన వరదధ్ని విమధ్యమానే

ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషాః

రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 11 ॥

తా. ఓ శేషాద్రినాధుడవగు ఓ వేంకటేశ్వరా! గొల్ల పల్లెలలోని గొల్లపడుచులు పెరుగు చిలుకుచుండగా ఆ చిలికిన ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనించుచున్నవి. ఆ ధ్వని, ప్రతిధ్వనుల బట్టి పెరుగుకుండలు, దిక్కులు కలహించుచున్నవా? అన్నట్లు కానవచ్చుచున్నవి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.

పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః

హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః

భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 12 ॥

తా. సూర్యుని మిత్రములగు కమలములయందున్న తుమ్మెదలు, తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతిని అపహరించుటకు బయలు వెడలి భేరీని వాయించునట్లు ధ్వని చేయుచున్నవి. ఓ శేషాచల ప్రభూ! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో

శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో

శ్రీ దేవతాగృహభుజాంతర దివ్యమూర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 13 ॥

తా. శ్రీమంతుడవైన ఓ దేవా! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకములన్నింటికిని బంధువుడవు. ఓ శ్రీనివాసా! లోకములన్నింటను నీ వొక్కడవే దయాసముద్రుడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్సు కలవాడవు. దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవనిర్మలాంగాః

శ్రేయోర్థినో హరవిరించి సనందనాద్యాః

ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 14 ॥

తా. బ్రహ్మ, శివుడు, సనందనుడు మున్నగువారు స్వామి పుష్కరిణిలో స్నానముచేసి పరిశుద్ధులై తమ మేలునకై ద్వారముకడ బెత్తములవారు తలలపయి కొట్టుచున్నను లెక్కింపక కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి

నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం

ఆఖ్యాం త్వదయవసతే రనిశం వదంతి

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 15 ॥

See Also  Lord Shiva Ashtakam 2 In Telugu

తా. ఓ వేంకటేశ్వరా! నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.

సేవాపరాః శివసురేశ కృశానుధర్మ

రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః

బద్ధాంజలి ప్రవిలసన్నిజశీర్ష దేశాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 16 ॥

తా. ఈశానుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి వరుణుడు, వాయువు, కుబేరుడు అను అష్టదిక్పతులును శిరస్సులపయి చేతులు మోడ్చి నీ సేవకయి కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ

నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః

స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 17 ॥

తా. దేవా! గరుడుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును దండయాత్రలయందు తమ తమ శక్తిని చూపుటకు నీ యనుమతిని వేడుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీ­ు సుప్రభాతమగు గాక.

సూర్యేందు భౌమబుధవాక్పతి కావ్యసౌరి

స్వర్భాను కేతుదివి షత్సరిషత్ప్రధానాః

త్వద్దాస దాస చరమావధిదాస దాసాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 18 ॥

తా. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను నవగ్రహములును నీ దాస, దాసచరమావధి దాసులకు దాసులయి యున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః

స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా

కల్పాగమా7కలనయా కులతాం లభంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 19 ॥

తా. ఓ స్వామీ! నీ పాదధూళిచే శిరస్సు పవిత్రమైనవారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడ కోరరు. ఈ కల్పము అంతమైపోవునేమో అనియే కలత పడుచుందురు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః

స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః

మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయన్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 20 ॥

తా. స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూచి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచు ఉండవలెనని కోరుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్ధే

దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే

శ్రీ మన్ననంత గరుడాదిభిరర్చితాంఘ్రే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 21 ॥

తా. ఓ దేవాదిదేవా! నీవు శ్రీదేవికి, భూదేవికి భర్తవు. దయ మున్నగు గుణములకు పాలసముద్రము వంటివాడవు. లోకములకన్నింటికి శరణమిచ్చువాడవు నీవొక్కడవే. అనంతుడు, గరుడుడు నీ పాదములను సేవించుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ

వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే

శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 22 ॥

తా. ఓ వేంకటేశ్వరా! నీవు పద్మము నాభియందు కలవాడవు. పురుషోత్తముడవు. వాసుదేవుడవు. వైకుంఠుడవు. మాధవుడవు. జనులను రక్షించువాడవు. హస్తమున చక్రము కలవాడవు. శ్రీవత్స చిహ్నము కలవాడవు. శరణుజొచ్చినవారి పాలిట కల్పవృక్షమవు. నీకు సుప్రభాతమగు గాక.

కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే

కాంతాకుచాంబురుహ కుట్మలలోలదృష్టే

కల్యాణనిర్మల గుణాకర దివ్యకీర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 23 ॥

See Also  Shrrigala Gita In Telugu

తా. మన్మధుని గర్వము నణచు దివ్యసుందర శరీరము కల ఓ దేవా! నీ దృష్టి తామర మొగ్గలవంటి యువతి కుచములపయి పరిభ్రమించు చుండును. నీవు కీర్తి కలవాడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాత మగుగాక.

మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్‌

స్వామిన్‌ పరశ్వథ తపోధన రామచంద్ర

శేషాంశరామ యదునందన కల్కిరూప

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 24 ॥

తా. ఓ వేంకటేశ్వరా! నీవు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కిరూపములను ధరించితివి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.

ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం

దివ్యం వియత్సరసిహేమఘటేషు పూర్ణం

ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్ఠాః

తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్‌ ॥ 25 ॥

తా. ఓ దేవా! వైదికులగు భక్తులు, ఏలకులతోను, పచ్చకర్పూరముతోను పరిమళించు పవిత్రగంగా జలమును బంగారు కలశముల నిండుగా నింపి తెచ్చి సంతోషముతో నీ సేవకై యెదురు చూచుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

భాస్వానుదేతి వికటాని సరోరుహాణి

సంపూరయంతి నినదైః కకుభో విహంగాః

శ్రీ వైష్ణవాః సతత మర్దిత మంగళాస్తే

ధామాశ్రయంతి తవ వేంకటసుప్రభాతమ్‌ ॥ 26 ॥

తా. ఓ దేవా! సూర్యుడు ఉదయించుచున్నాడు. కమలములు వికసించుచున్నవి. పక్షులు తమ కిలకిలరావములతో దిక్కులను నింపుచున్నవి. శ్రీవైష్ణవులు శుభములను కోరుచు నీ సన్నిధిలో వేచియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

బ్రహ్మాదయస్సురవరాస్స మహర్షయస్తే

సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః

ధామాంతికే తవ హి మంగళవస్తు హస్తాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 27 ॥

తా. ఓ దేవా! బ్రహ్మ మున్నగు దేవతలు, మహర్షులు, సనందనుడు మున్నగు సత్పురుషులు, యోగులును నీ పూజకు తగిన మంగళకర వస్తువులను హస్తములందు ధరించి, నీ సన్నిధికి వచ్చియున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

లక్ష్మీనివాస నిరవద్యగుణైక సింధో

సంసారసాగర సముత్తరణైక సేతో

వేదాంతవేద్య నిజవైభవ భక్త భోగ్య

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 28 ॥

తా. ఓ దేవా! నీవు లక్ష్మీదేవికి నివాసమైనవాడవు. సద్గుణ సముద్రుడవు. సంసార సాగరమును తరించుటకు అనువైన వారధివి. వేదాంతములచే తెలిసికొనదగిన వైభవమును కలవాడవు. భక్తులకు స్వాధీనుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతమ్‌ (ఇత్థం వృషాచలపతే తవ సుప్రభాతమ్‌- కొన్ని పుస్తకాలలొ ఇల కూడ ఉన్ది)

యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః

తేషాం ప్రభాతసమయే స్మృతిరంగ భాజాం

ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే ॥ 29 ॥

తా. వృషాచలపతియగు శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమున పఠించువారికి ఈ స్మృతి మోక్షసాధనమగు ప్రజ్ఞ కలిగించు చుండును.

– Chant Stotra in Other Languages –

Venkateswara Suprabhatam Lyrics – Kousalya supraja rama poorva Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil