Tirumala Giri Raaya In Telugu

 ॥ Tirumala Giri Raaya Telugu Lyrics ॥

తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ ।
సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ॥

సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ ।
సరసవైభవరాయ సకలవినోదరాయ ।
వరవసంతములరాయ వనితలవిటరాయ ।
గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ ॥

గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ ।
చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ ।
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ ।
కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ ॥

సామసంగీతరాయ సర్వమోహనరాయ ।
ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ ।
కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను ।
శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Tirumala Giri Raaya Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Sri Adi Shankaracharya Stuti Ashtakam In Tamil