Brahma Kadigina Padamu In Telugu

॥ Brahma Kadigina Padamu Telugu Lyrics ॥

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము దానె నీ పాదము ॥

చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము ।
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము ॥

కామిని పాపము కడిగిన పాదము
పాముతల నిడిన పాదము ।
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము ॥

పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము ।
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Brahma Kadigina Padamu Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Narayana Sukta Stotram In Tamil And English