Indariki Abhayambu In Telugu

॥ Indariki Abhayambu Telugu Lyrics ॥

ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి ॥

వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి ।
కలికియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోళ్ళ వాడిచేయి ॥

తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి ।
మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ॥

పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి ।
తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Indariki Abhayambu Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Mantra Siddhiprada Maha Durga Ashtottara Shatanama Stotram In Tamil