Sarvaantaraatmudavu In Telugu

॥ Sarvaantaraatmudavu Telugu Lyrics ॥

సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను ।
సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ॥

వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి ।
కోరేటియపరాధాలు కొన్ని వేసి ।
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ ।
దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ॥

మనసు చూడవలసి మాయలు నీవే కప్పి ।
జనులకు విషయాలు చవులుచూపి ।
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి ।
ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ॥

వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే ।
కన్నకన్న భ్రమతలే కల్పించి ।
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె ।
నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Sarvaantaraatmudavu Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Alphabet-Garland Of 108 Names Of Bhagavan Pujya Sri Swami Dayananda In Tamil