Tandanana Ahi In Telugu

॥ Tandanana Ahi Telugu Lyrics ॥

తందనాన అహి, తందనాన పురె
తందనాన భళా, తందనాన ॥

బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే ॥

కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ ।
ఇందులో జంతుకుల మంతా ఒకటే
అందరికీ శ్రీహరే అంతరాత్మ ॥

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర – అదియు నొకటే ।
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే ॥

అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే ।
దిన మహోరాత్రములు – తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు ॥

కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే ।
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే ॥

కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే ।
కడు పుణ్యులను – పాప కర్ములను సరి గావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Tandanana Ahi Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Sri Krishna Lahari Stotram In Tamil