Mangalam Jaya Mangalam In Telugu

॥ Mangalam Jaya Mangalam Telugu Lyrics ॥

॥ మంగళం జయ మంగళం ॥
మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం
మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం ॥

శిరమునందున మెరయుచుండెడి నెమలిపింఛకు మంగళం
శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం ॥

వనజదమ్మును ధిక్కరించెడి వదన శోభకు మంగళం
కరుణ రసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం ॥

బ్రహ్మచే పూజింపబడిన చరణ యుగళికి మంగళం
జగములన్నియు కన్నతండ్రగు చక్కనయ్యకు మంగళం ॥

గోపికా గణ సేవితుడు శ్రీ గోవిందునకు మంగళం
రాధికా పరివేష్టితుండౌ రసేశ్వరునకు మంగళం ॥

– Chant Stotra in Other Languages –

Sri Thyagaraja Keerthana » Mangalam Jaya Mangalam Lyrics in English

See Also  Sri Lakshmi Kavacham In Tamil