Mangalam Govindunaku In Telugu

॥ Mangalam Govindunaku Telugu Lyrics ॥

॥ మంగళము గోవిందునకు ॥
మంగళము గోవిందునకు జయ మంగళము గరుడ ధ్వజునకు
మంగళము జయ మంగళము ధర్మ స్వరూపునకు – జయ జయ మంగళము ॥

ఆదికిను ఆద్యైన దేవునకచ్యుతునకంభోజ నాభున-
కాదికూర్మంబైన జగదాధార ముర్తికిని
వేద రక్షకునకును సంతత వేదమార్గ విహారునకు బలి-
భేదినికి సామాదిగాన ప్రియ విహారునకు ॥ జయ జయ మంగళము ॥

హరికి పరమేశ్వరునకు శ్రీధరునకు కాలాంతకునకును
పరమ పురుషోత్తమునకు బహుబంధ దూరునకును
సురముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్టునకు కరుణా
కరుణకును కాత్యాయినీ నుత కలిత నామునకు ॥ జయ జయ మంగళము ॥

పంకజాసన వరదునకు భవ పంక విచ్ఛేదునకు భవునకు
శంకరునకవ్యక్తునకు నాశ్చర్యరూపునకు
వేంకటాచల వల్లభునకును విశ్వముర్తికి నీశ్వరునకును
పంకజా కుచకుంభ కుంకుమపంక లోలునకు ॥ జయ జయ మంగళము ॥

– Chant Stotra in Other Languages –

Sri Thyagaraja Keerthana » Mangalam Govindunaku Lyrics in English

See Also  Anaimugam Anavanin Anbumikka Thanthaiye Bhajan In Tamil