Chalada Harinama In Telugu

 ॥ Chaaladaa Hari Naama Telugu Lyrics ॥

చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు ।
చాలదా హితవైన చవులెల్లను నొసగ ॥

ఇది యొకటి హరి నామ మింతైన జాలదా ।
చెదరకీ జన్మముల చెరలు విడిపించ ।
మదినొకటె హరినామ మంత్రమది చాలదా ।
పదివేల నరక కూపముల వెడలించ ॥

కలదొకటి హరినామ కనకాద్రి చాలదా ।
తొలగుమని దారిద్ర్యదోషంబు చెరుచ ।
తెలివొకటి హరినామదీప మది చాలదా ।
కలుషంపు కఠిన చీకటి పారద్రోల ॥

తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా ।
జగములో కల్పభూజంబు వలె నుండ ।
సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా ।
నగవు జూపులను నున్నతమెపుడు జూప ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » 44 Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Sri Vatapuranatha Ashtakam In Tamil