Ekkuva Kulajudaina In Telugu

॥ Ekkuva Kulajudaina Telugu Lyrics ॥

ఎక్కువ కులజుడైన హీన కులజుడైన
నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ॥

వేదములు చదివియును విముఖుడై హరిభక్తి
యాదరించని సోమయాజి కంటె ।
ఏదియును లేని కుల హీనుడైనను విష్ణు
పాదములు సేవించు భక్తుడే ఘనుడు ॥

పరమ మగు వేదాంత పఠన దొరికియు సదా
హరి భక్తి లేని సన్యాసి కంటె ।
సరవి మాలిన అంత్య జాతి కులజుడైన
నరసి విష్ణుని వెదకు నాతడే ఘనుడు ॥

వినియు చదివియు, శ్రీ విభుని దాసుడు గాక
తనువు వేపుచు నుండు తపసి కంటె ।
ఎనలేని తిరు వేంకటేశు ప్రసాదాన్న
మనుభవించిన యాతడప్పుడే ఘనుడు ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Ekkuva Kulajudaina Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Sri Rahu Ashtottara Shatanama Stotram In Tamil