Gaaline Poya In Telugu

॥ Gaaline Poya Telugu Lyrics ॥

గాలినే పోయ గలకాలము
తాలిమికి గొంతయు బొద్దులేదు ॥

అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు
గుడుగుకొననే పట్టె గలకాలము ।
ఒడలికి జీవుని కొడయడైనహరి
దడవగా గొంతయు బొద్దులేదు ॥

కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె కలుషదేహపుబాధ గలకాలము ।
తలపోసి తనపాలి దైవమైన హరి
దలచగా గొంతయు బొద్దులేదు ।

శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె
గరిమల గపటాల గలకాలము ।
తిరువేంకటగిరి దేవుడైనహరి
దరిచేరా గొంతయు బొద్దులేదు ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Gaaline Poya Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Gaaline Poya In Malayalam