Ghanudaatade Mamu In Telugu

॥ Ghanudaatade Mamu Telugu Lyrics ॥

ఘనుడాతడే మము గాచుగాక హరి
అనిశము నేమిక నతనికె శరణు ॥

యెవ్వని నాభిని యీ బ్రహ్మాదులు
యెవ్వడు రక్షకుడిన్నిటికి ।
యెవ్వని మూలము యీ సచరాచర
మవ్వల నివ్వల నతనికే శరణు ॥

పురుషోత్తముడని పొగడి రెవ్వరిని
కరి నెవ్వడు గాచె ।
ధర యెవ్వడెత్తి దనుజుల బొరిగొనె
అరుదుగ మేమిక నతనికె శరణు ॥

శ్రీసతి యెవ్వని జేరి వురమునను
భాసిల్లె నెవ్వడు పరమంబై ।
దాసుల కొరకై తగు శ్రీవేంకట
మాస చూపి నితడతనికె శరణు ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Ghanudaatade Mamu Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Sri Dakshinamurthy Pancharatna Stotram In Tamil