Hari Yavataara Mitadu In Telugu

॥ Hari Yavataara Mitadu Telugu Lyrics ॥

హరి యవతార మీతడు అన్నమయ్య ।
అరయ మా గురుడీతడు అన్నమయ్య ।

వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు
ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య ।
ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు
ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య ॥

ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు
ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య ।
భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు
హావ భావమై తాళ్ళపాక అన్నమయ్య ॥

క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య ।
ధీరుడై సూర్యమండల తేజము వద్ద నున్నవాడు
ఆరీతుల తాళ్ళపాక అన్నమయ్య ॥

॥ Hari Yavataara Mitadu Meaning ॥

అన్నమయ్యను సాక్షాత్తూ హరి అవతారంగా కీర్తిస్తూ, ఆ మహానుభావుని విశేషతలను ఈ కీర్తన ద్వారా మనకందిస్తున్నాడు పెదతిరుమలయ్య!!
వెకుంఠ౦లో స్వామివారి వద్ద అన్నమాచార్యుల వారు ఆశీనులై తన భక్తికి సూచికగా సంకీర్తనలను గానం చేస్తున్నారు! క్షీరసాగరంలో కొలువెన శ్రీ విష్ణు పాదములను నిత్యం సేవిస్తున్నారు ఆచార్యులవారు! ఇందిరా దేవితో కూడిన శ్రీవేంకటేశ్వర స్వామి వారిని తన సంకీర్తనా తేజస్సుతో ధీరుడై అన్నమయ్య ఆరాధిస్తున్నాడని పెద తిరుమలాచార్యులవారు భక్తి పూర్వకంగా కొనియాడూతున్నారు.ఆసరము=సూచిక

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Hari Yavataara Mitadu Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Sri Krishna Ashtakam 2 In Tamil