Jagadapu Chanavula In Telugu

॥ Jagadapu Chanuvula Telugu Lyrics ॥

జగడపు చనువుల జాజర
సగినల మంచపు జాజర ॥

మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున ।
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర ॥

భారపు కుచముల పైపై కడు సిం-
గారము నెరపేటి గంధవొడి ।
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు చల్లేరు జాజర ॥

బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము ।
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమ దంబుల జాజర ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Jagadapu Chanavula Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Gurujnanavasishtha’S Ribhu Gita In Tamil