Kanti Nakhilaanda In Telugu

॥ Kanti Nakhilaanda Telugu Lyrics ॥

కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి ।
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ॥

మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి ।
బహు విభవముల మంటపములు గంటి ।
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి ।
రహి వహించిన గోపురములవె కంటి ॥

పావనంబైన పాపవినాశము గంటి ।
కైవశంబగు గగన గంగ గంటి ।
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి ।
కోవిదులు గొనియాడు కోనేరి గంటి ॥

పరమ యోగీంద్రులకు భావగోచరమైన ।
సరిలేని పాదాంబుజముల గంటి ।
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి ।
తిరు వేంకటాచలాధిపు జూడగంటి ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Kanti Nakhilaanda Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  1000 Names Of Akkalakota Swami Samartha – Sahasranama Marathi In Tamil