Kodekaade Veede In Telugu

Kodekaade Veede Telugu Lyrics ॥

కోడెకాడె వీడె వీడె గోవిందుడు
కూడె ఇద్దరు సతుల గోవిందుడు ॥

గొల్లెతల వలపించె గోవిందుడు
కొల్లలాడె వెన్నలు గోవిందుడు ।
గుల్ల సంకుఁజక్రముల గోవిందుడు
గొల్లవారింట పెరిగె గోవిందుడు ॥

కోలచే పసులగాచె గోవిందుడు
కూలగుమ్మె కంసుని గోవిందుడు ।
గోలయై వేల కొండెత్తె గోవిందుడు
గూళెపుసతులఁ దెచ్చె గోవిందుడు ॥

కుందనపు చేలతోడి గోవిందుడు
గొందులు సందులు దూరె గోవిందుడు ।
కుందని శ్రీవేంకటాద్రి గోవిందుడు
గొందిఁ దోసె నసురల గోవిందుడు ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Kodekaade Veede Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Sree Mahishaasura Mardini Stotram In Tamil