Kolani Dopariki In Telugu

॥ Kolani Dopariki Telugu Lyrics ॥

కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు ।
కుల స్వామికిని గొబ్బిళ్ళో ॥

కొండ గొడుగుగా గోవుల గాచిన ।
కొండొక శిశువునకు గొబ్బిళ్ళో ।
దండగంపు దైత్యుల కెల్లను తల ।
గుండు గండనికి గొబ్బిళ్ళో ॥

పాప విధుల శిశుపాలుని తిట్టుల ।
కోపగానికిని గొబ్బిళ్ళో ।
యేపున కంసుని యిడుమల బెట్టిన ।
గోప బాలునికి గొబ్బిళ్ళో ॥

దండివైరులను తరిమిన దనుజుల ।
గుండె దిగులునకు గొబ్బిళ్ళో ।
వెండిపైడి యగు వేంకట గిరిపై ।
కొండలయ్యకును గొబ్బిళ్ళో ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Kolani Dopariki Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Lali Sri Krishnayya In Telugu