Maccha Kurma Varaha In Telugu

॥ Maccha Kurma Varaha Telugu Lyrics ॥

మచ్చ కూర్మ వరాహ మనుష్య సింహ వామనా
యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ ॥

నన్నుగావు కేశవ నారాయణ మాధవ
మన్నించు గోవింద విష్ణు మధుసూదన ।
వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా
సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ ॥

కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ
అంటేజాలు ప్రద్యుమ్నుడా అనిరుధ్ధుడా ।
తొంటే పురుషోత్తమ అథోక్షజా నారసింహమా
జంటవాయుకు మచ్యుత జనార్దన ॥

మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ
యెక్కితి శ్రీవేంకట మిందిరానాథ ।
యిక్కువ నీ నామములు యివియే నా జపములు
చక్కగా నీ దాసులము సర్వేశ అనంత ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Maccha Kurma Varaha Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Sri Amba Pancharatna Stotram In Tamil