Nagavulu Nijamani In Telugu

॥ Nagavulu Nijamani Telugu Lyrics ॥

నగవులు నిజమని నమ్మేదా ।
వొగినడియాసలు వొద్దనవే ॥

తొల్లిటి కర్మము దొంతల నుండగ ।
చెల్లబోయిక జేసేదా ।
యెల్ల లోకములు యేలేటి దేవుడ ।
వొల్ల నొల్లనిక నొద్దనవే ॥

పోయిన జన్మము పొరుగులనుండగ ।
చీయనక యిందు జెలగేదా ।
వేయినామముల వెన్నుడమాయలు ।
ఓ యయ్య యింక నొద్దనవే ॥

నలి నీనామము నాలికనుండగ ।
తలకొని యితరము దడవేదా ।
బలు శ్రీ వేంకటపతి నిన్నుగొలిచి ।
వొలుకు చంచలము లొద్దనవే ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Nagavulu Nijamani Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Pratasmarana Stotram In Tamil