॥ Nanati Bathuku Telugu Lyrics ॥
నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము ॥
పుట్టుటయు నిజము, పోవుటయు నిజము
నట్టనడిమీ పని నాటకము ।
యెట్టనెదుటి కలదీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము ॥
కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము ।
వొడి కట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము ॥
తెగదు పాపము, తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము ।
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము ॥
– Chant Stotra in Other Languages –
Annamacharya Keerthanalu » Nanati Bathuku Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil