Narayanaya Namo Namo In Telugu

॥ Naraayanaya Namo Namo Telugu Lyrics ॥

నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో
యీరచనలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ॥

గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో
భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో ।
దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు
యీవరుసలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ॥

దామోదరాయ నమో నమో ధరణీశాయ నమో నమో
శ్రీమహిళాపతయే నమో శిష్టరక్షిణే నమో నమో ।
వామనాయ తే నమో నమో వనజాక్షాయ నమో నమో
యీమేరలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ॥

పరిపూర్ణాయ నమో నమో ప్రణవాగ్రాయ నమో నమో
చిరంతన శ్రీ వేంకటనాయక శేషశాయినే నమో నమో ।
నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో
యిరవుగ నీగతి నెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Narayanaya Namo Namo Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Raamudu Lokaabhiraamudu In Kannada