Okapari Kokapari In Telugu

॥ Okapari Kokapari Telugu Lyrics ॥

ఒకపరి కొకపరి కొయ్యారమై ।
మొకమున కళలెల్ల మొలచినట్లుండె ॥

జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి ।
జిగికొని నలువంక చిందగాను ।
మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన ।
పొగరు వెన్నెల దిగబోసి నట్లుండె ॥

పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు ।
కరగి ఇరుదెసల కారగాను ।
కరిగమన విభుడు గనుక మోహమదము ।
తొరిగి సామజసిరి తొలికినట్లుండె ॥

మెరయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను ।
తరచైన సొమ్ములు ధరియించగా ।
మెరుగు బోడి అలమేలు మంగయు తాను ।
మెరుపు మేఘము గూడి మెరసినట్లుండె ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Okapari Kokapari Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Yogaprada Ganesha Stotram In Tamil