Raajeeva Netraaya In Telugu

॥ Rajeeva Netraya Telugu Lyrics ॥

రాజీవ నేత్రాయ రాఘవాయ నమో ।
సౌజన్య నిలయాయ జానకీశాయ ॥

దశరథ తనూజాయ తాటక దమనాయ
కుశిక సంభవ యఙ్ఞ గోపనాయ ।
పశుపతి మహా ధనుర్భంజనాయ నమో
విశద భార్గవరామ విజయ కరుణాయ ॥

భరిత ధర్మాయ శుర్పణఖాంగ హరణాయ
ఖరదూషణాయ రిపు ఖండనాయ ।
తరణి సంభవ సైన్య రక్షకాయనమో
నిరుపమ మహా వారినిధి బంధనాయ ॥

హత రావణాయ సంయమి నాథ వరదాయ
అతులిత అయోధ్యా పురాధిపాయ ।
హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో
వితత వావిలిపాటి వీర రామాయ ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Raajeeva Netraaya Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Shiva Pratah Smaran Stotram In Tamil