Ananda Manandamayenu Srijanaki Ramasmarana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ananda Manandamayenu Srijanaki Ramasmarana Lyrics ॥

నాదనామక్రియ – ఆది (పూరీకళ్యాణి – త్రిపుట)

పల్లవి:
ఆనంద మానందమాయెను శ్రీజానకి రామస్మరణ చేయగనే ఆ ॥

అను పల్లవి:
నేడార్యులకృప మాకు కలిగెను ఇప్పుడిరువ
దేడింటనున్న పరమాత్ముని జూడగానే ఆ ॥

చరణము(లు):
పరమభక్తి శ్రద్ధగల్గెను బహు
దురితజాలములెల్ల దొలగెను ఆ ॥

పటురాగ ద్వేషములెల్లవీడెను
ఇటు రాజయోగమున ఉన్న రాజును జూడగ ఆ ॥

పూర్వపుణ్యము లొనగూడెను శ్రీ
పార్వతి జపమంత్రమీడేరెను ఆ ॥

పూర్వకృతమ్బు కనబడెను పరమ
పావనమైన శ్రీహరి సేవగల్గె నేడు ఆ ॥

సామాన్యుల చెంత చేరము వట్టి
పామరజనుల నిక గూడము మేము అ ॥

కామబద్ధుల జేరి వేడము మాకు హరి
నామ స్మరణజేయు భాగవతులె దిక్కు ఆ ॥

రామభక్తుల జేరగల్గితిమి ఇతర
కామము లెల్లను వీడగల్గితిమి ఆ ॥

పరభామలపైని భ్రాంతిదొలగెను మేము
పరులదోషములెన్న మొరులను నెదురాడము ఆ ॥

ఇతర చింతనల చేయము వేరే
ఇతర దైవములను గొనియాడము మేము ఆ ॥

ధరాపతులకు మ్రొక్కింత సేయము
భద్రాచల రామసేవ మానము మానము ఆ ॥

భద్రాద్రి స్వామి మాకు దైవము వేరు
క్షుద్రదేవతలను దలపము దలపము ఆ ॥

దారిద్ర్యములనెల్ల మది నెంచము భద్ర
గిరి రామదాసునేలిన పరమదయాళుడుండ ఆ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Rama Chandraya In Telugu – Sri Ramadasu Keerthanalu