Pahi Rama Prabho In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Pahi Rama Prabho Lyrics ॥

నాదనామక్రియ – ఏక (మధ్యమావతి – ఝంప)

చరణము(లు):
పాహిరామప్రభో పాహిరామప్రభో
పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో పా ॥

శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీ
నామకీర్తనలు వర్ణింతు రామప్రభో పా ॥

సుందరాకార హృన్మందిరోద్ధార సీ
తేందిరా సంయుతానంద రామప్రభో పా ॥

ఇందిరా హృదయారవిందాదిరూఢ
సుందారాకార ఆనంద రామప్రభో పా ॥

ఎందునేజూడ మీసుందరాననము
కందునో కన్నులింపొంద రామప్రభో పా ॥

పుణ్యచారిత్రలావణ్య కారుణ్య గాం
భీర్య దాక్షిణ్య శ్రీరామచంద్రప్రభో పా ॥

కందర్పజనక నాయందు రంజిల సదా
నందుడవై పూజలందు రామప్రభో పా ॥

ఇంపుగా జెవులకు న్విందుగా నీకథల్‌
కందుగా మిమ్ము సొంపొంద రామప్రభో పా ॥

వందనముచేసి మునులందరు ఘనులైరి
విందవైనట్టి గోవింద రామప్రభో పా ॥

బృందారకాది సద్బృందార్చితావతార
వింద ముని సందర్శితానంద రామప్రభో పా ॥

తల్లివినీవె మాతండ్రివినీవె మా
ధాతవునీవె మాభ్రాత రామప్రభో పా ॥

పల్లవాధరలైన గొల్లభామలగూడి
యుల్లమలరంగ రంజిల్లు రామప్రభో పా ॥

మల్లరంగంబునందెల్ల మల్లులజీరి
యల్ల కంసుని జంపు మల్ల రామప్రభో పా ॥

కొల్లలుగ నీమాయ వెల్లివిరియగ జేయ
సల్లాపమున క్రీడసల్పు రామప్రభో పా ॥

తమ్ముడును నీవు పార్శ్వమ్ములంజేరి వి
ల్లమ్ములెక్కెడి నిల్చుటిమ్ము రామప్రభో పా ॥

క్రమ్ముకొనిశాత్రవులు హుమ్మనుచువచ్చెదరు
ఇమ్మైనబాణములిమ్ము రామప్రభో పా ॥

రమ్ము నాకభయమ్ము నిమ్ము నీపాదముల్‌
నమ్మినానయ్య శ్రీరామచంద్రప్రభో పా ॥

కంటి మీ శంఖమ్ము కంటి మీ చక్రము
కంటి మీ పాదముల్గంటి రామప్రభో పా ॥

వింటి మహిమ వెన్నంటి తమ్ముడు నీవు
జంటరావయ్య నావెంట రామప్రభో పా ॥

మేము నీవారమైనాము రక్షింపుమ
న్నాము జాగేల శ్రీరామచంద్రప్రభో పా ॥

నామనోవీధిని ప్రేమతోనుండు మీ
భూమిజాసహిత జయ రామచంద్రప్రభో పా ॥

మీ మహత్త్వమ్ము విన మనమందు ప్రేమ
వేమరున్‌ బుట్టు శ్రీరామచంద్రప్రభో పా ॥

శ్యామసుందర కోమలం జానకీమనః
కాముకం త్వం భజే రామచంద్రప్రభో పా ॥

కామితార్థములిచ్చు నీ మహత్వము విన్న
నా మొరాలించు నాస్వామి రామప్రభో పా ॥

కామితప్రభుడవై ప్రేమతో రక్షించు
స్వామి సాకేతపురి రామచంద్రప్రభో పా ॥

అన్న రావన్న నీకన్న నామీద నెన
రున్న వారేరి నాయన్న రామప్రభో పా ॥

నిన్నెగాకను మరే యన్యులగానన్‌
గన్నతండ్రివిగ మాయన్న రామప్రభో పా ॥

వెన్నదొంగిలి తిన్న చిన్నకృష్ణమ్మ ని
న్నెన్నగా వశమె రావన్న రామప్రభో పా ॥

ఎన్నెన్నో జన్మముల నెత్తజాలను ఇక
నిన్నె నెమ్మదిని వర్ణింతు రామప్రభో పా ॥

ఎన్నివిధములనైన నిన్నె నమ్మిన వాని
మన్నించి దయచేయుమన్న రామప్రభో పా ॥

See Also  108 Names Of Rama 3 – Ashtottara Shatanamavali In Telugu

పన్నగాధిపశాయి భావనాతీత ఆ
పన్న నామనవి వినవన్న రామప్రభో పా ॥

మేటివాక్యంబు మీసాటిదైవంబు ము
మ్మాటికిని భువిలేదు మేటి రామప్రభో పా ॥

పాడుదును మిమ్ము గొనియాడుదును మోదమున
వేడుచున్నాను గాపాడు రామప్రభో పా ॥

వేడుకోగానె నీజోడుకాడును నీవు
కూడి రారయ్య నాతోడ రామప్రభో పా ॥

నేడు నాకోర్కె లీడేరగాజేసి కా
పాడరా కరినేలు జాడ రామప్రభో పా ॥

మూడుమూర్తుల కాత్మమూలమై చెన్నొందు
వాడవని శ్రుతులు నిన్నాడు రామప్రభో పా ॥

చూడు మీభక్తులను గూడు మీరిపుల గో
రాడు మీవల్ల గోవింద రామప్రభో పా ॥

పుండరీకాక్ష మార్తాండవంశోద్భవా
ఖండలస్తుత్య కోదండ రామప్రభో పా ॥

కుండలిశయన భూమండలోద్ధరణ పా
షండజనహరణ కోదండరామప్రభో పా ॥

నిండుదయతోడ నాయండ బాయకను నీ
వుండి గాపాడు కోదండరామప్రభో పా ॥

జాతకౌతూహలం చక్షుకృత్యారమాం
పూతసీతాపతే దాత రామప్రభో పా ॥

పాతకులలో మొదటి పాతకుడ నావంటి
పాతకుని కావుటే ఖ్యాతి రామప్రభో పా ॥

భూతనాథుని విల్లు ఖ్యాతిగా ఖండించి
సీతగైకొన్న విఖ్యాత రామప్రభో పా ॥

పూతనాకల్మషోద్ధూత పె\న్‌శత్రు సం
హారి శ్రీసీతాసమేత రామప్రభో పా ॥

జాతినీతులులేక భూతలంబున దిరుగు
ఘాతకుల బరిమార్చు నేత రామప్రభో పా ॥

ఎప్పుడును గంటికి రెప్పవలె గాచి న
న్నొప్పుగాగావు మాయప్ప రామప్రభో పా ॥

ఏదయా నీదయా యోదయాంభోనిధీ
యాదిలేదయ్య నామీద రామప్రభో పా ॥

ఘోరరాక్షస గర్వహార విశ్వంభరో
ద్ధార గుణసాంద్రవిస్తార రామప్రభో పా ॥

మోదమున నీవు నన్నాదుకోవయ్య గో
దావరీ తీర భద్రాద్రి రామప్రభో పా ॥

నీదు బాణంబులను నాదుశత్రులబట్టి
బాధింపకున్నావదేమి రామప్రభో పా ॥

ఆదిమధ్యాంత బహిరాంతరాత్ముడవనుచు
వాదింతునే జగన్నాథ రామప్రభో పా ॥

చాలదేమి పదాబ్జములసాటి యీపదు
నాల్గులోకంబుల గూడి రామప్రభో పా ॥

ఏల యీలాగు జాగేల జేసెదవు మ
మ్మేలుకోవయ్య మాపాలి రామప్రభో పా ॥

పాలువెన్నలు మ్రుచ్చిలింతివని యశోద
రోటగట్టిన మాయచాలు రామప్రభో పా ॥

కొల్లలుగ వ్రేపల్లె పల్లవాధరులతో
నల్లబిల్లిగను రంజిల్ల రామప్రభో పా ॥

వాలి నొక్కమ్మునన్‌ గూలవేసిన శౌర్య
శాలియౌ నినుదలతు జాల రామప్రభో పా ॥

సాలభంజికల నిర్మూలంబు చేయగా
జాలితివి గోపాలబాల రామప్రభో పా ॥

తాళవృక్షము లొక్కకోల ధరగూలగా
లీలనేసిన బాహుశాలి రామప్రభో పా ॥

(శిలయైన యహల్య శ్రీపాదములు సోక నెలతయై మిము మదితలచె పా ॥
)
వినవయ్య మనవి గైకొనవయ్య తప్పులన్‌
గనకయ్య సమ్మతిన్గొనుచు రామప్రభో పా ॥

దానధర్మంబులున్‌ దపజపంబులు నీదు
నామకీర్తనకు సరిరావు రామప్రభో పా ॥

మానావమానములు మహిని నీవై యుండ
మాకేల మదిని ఈచింత రామప్రభో పా ॥

See Also  Svasvamiyugala Ashtakam In Telugu

జ్ఞానయోగాభ్యాసమందు నుండెడివారి
కానందమయుడవైనావు రామప్రభో పా ॥

భానువంశమునందు మానవాధిపుడవై
దానవుల బరిమార్చినావు రామప్రభో పా ॥

అణురేణు పరిపూర్ణుడౌ హృదయవాస నా
మనవి విను దేవకీతనయ రామప్రభో పా ॥

మాన్యమై ఆశ్రితవదాన్యమై సుజన స
న్మాన్యమై వెలుగు మూర్ధన్య రామప్రభో పా ॥

నిత్యమై సత్యమై నిర్మలంబై మహిని
దివ్యవంశోత్తంసమైన రామప్రభో పా ॥

సేవ్యమై మీపదద్భావ్యమై సజ్జన
శ్రావ్యమై యుండునో దివ్య రామప్రభో పా ॥

గట్టిగా నీవున\న్‌ పట్టుగా విహితమౌ
నట్టుగా మమ్ము చేపట్టు రామప్రభో పా ॥

దిట్టయగు తాటకినిగొట్టి వేగమె గాధి
పట్టి యాగము గాచినట్టి రామప్రభో పా ॥

చుట్టుకొని కాళింగు డట్టహాసముచేయ
పట్టుకొని తలనెక్కినట్టి రామప్రభో పా ॥

సంతతము నన్ను రక్షింతువని నమ్మి మి
మ్మెంతురా జానకీకాంత రామప్రభో పా ॥

పంతమున మీ పాదచింతనము చేయ నా
వంతలన్నియు మానుటెంత రామప్రభో పా ॥

వింతగాదయ్య నేనింతనాడినది నా
పంతమున మిమ్ము భావింతు రామప్రభో పా ॥

శాంతమూర్తిని రమాకాంతుడవని చాల
సంతసంబున నిన్ను నెంతు రామప్రభో పా ॥

అక్షయంబైన నీకుక్షిలో లోకముల
రక్షించితివి లక్ష్మీవక్ష రామప్రభో పా ॥

దంతివత్సల భక్తచింతామణీ విశ్వ
మంతయును నీవు రక్షించు రామప్రభో పా ॥

పక్షివాహన శత్రునిక్షేపణా నన్ను
రక్షించు మోక్షప్రదాత రామప్రభో పా ॥

రక్షించి సజ్జనుల వీక్షించి దుర్జనుల
రాక్షసుల శిక్షించినావు రామప్రభో పా ॥

రక్షకుడవై జగద్రక్షణముచేయగా
రాక్షసుల శిక్షించినావు రామప్రభో పా ॥

లక్ష్మీకటాక్ష వీక్షణధార వృష్టి మా
కక్షయంబుగ కటాక్షించు రామప్రభో పా ॥

రావయా అభయంబు లీవయా నాస్వామీ
నీవయా గతి దేవరాయ రామప్రభో పా ॥

కావు కావుమటంచు కాకాసురుడురాగ
కాచి రక్షించినావయ్య రామప్రభో పా ॥

దేవదేవోత్తమా దేవేంద్రసన్నుతా
కావవేనన్ను శ్రీరామచంద్రప్రభో పా ॥

భావజజనక నా బాధలన్నియుమాన్పి
యే విధంబునైన నేలు రామప్రభో పా ॥

శ్రీవైష్ణవులపాలి చింతామణివి చాల
సేవగైకొని కరుణచేయు రామప్రభో పా ॥

భావమున మిముభక్తి సేవించు జనులకు
కైవల్యమొసగు శ్రీరామచంద్రప్రభో పా ॥

గోపాలురను గూడి యావులను మేపి
ఆపదోద్ధారకుడవైన రామప్రభో పా ॥

నాపాలి శ్రీరామ భూపాలకా నను
కాపాడరావ గోపాల రామప్రభో పా ॥

సారమౌశౌర్య విస్తారమౌ సుందరా
కారసద్భక్తమందార రామప్రభో పా ॥

శరణాగతత్రాణ బిరుదాంకితంబైన
వరము నాకొసగు యేమరక రామప్రభో పా ॥

శ్రీరామ రామేతి శ్రేష్ఠమంత్రము సారె
సారెకును వింతగా జదువ రామప్రభో పా ॥

శ్రీరామ నీనామ చింతనామృతపాన
సారమే నాదుమది గోరు రామప్రభో పా ॥

See Also  Sri Dakshayani Stotram In Telugu

చేరి మీపాద పద్మారాధనము చేయ
కోరినానయ్య శ్రీరామచంద్రప్రభో పా ॥

ఘోరరాక్షసగర్వహారి విశ్వంభరా
భూరిగుణసాంద్ర విస్తార రామప్రభో పా ॥

మారీచమాయానివార శరసంధాన
ధారుణీతనయా విహార రామప్రభో పా ॥

పరవాసుదేవ యక్షయపాత్ర మొసగి న
న్నరసి పోషింపగదవయ్య రామప్రభో పా ॥

పరధనంబును పరస్త్రీల నపేక్షించు
నరుకబ్బునే మోక్షమరయ రామప్రభో పా ॥

కామాదిదుర్గుణ స్తోమంబులడగ మీ
నామామృతమె దిక్కు రామచంద్రప్రభో పా ॥

దుష్టులగు దానవుల నష్టంబుగా జేయగా
బుట్టితివి కౌసల్య పట్టి రామప్రభో పా ॥

కష్టపడలేనయ్య పట్టాభిరామ నా
కిష్టసంపదలిచ్చి యేలు రామప్రభో పా ॥

కేశవాయనిన భవపాశముల్దొలగు స
ర్వేశకోటి శశిప్రకాశ రామప్రభో పా ॥

నారాయణా నీదు నామామృతం బెపుడు
పారాయణము చేతు నేను రామప్రభో పా ॥

మాధవాయనియు సమ్మోదమున నినుగొల్చు
సాధుసజ్జనదయాంభోధి రామప్రభో పా ॥

గోవింద గోవింద గోపాలకృష్ణయని
గోపకులు గొనియాడు గోపరామప్రభో పా ॥

విష్ణునా సర్వవర్ధిష్ణునా తత్త్వ భూ
యిష్ణునా నిర్మితం కృష్ణ రామప్రభో పా ॥

శ్రీధరా శ్రీకరా శ్రీనారసింహ గం
గాధర స్తోత్ర యానంద రామప్రభో పా ॥

మత్స్యమై జలధిలో జొచ్చి సోమకుద్రుంచి
తెచ్చి వేదము లజునకిస్తి రామప్రభో పా ॥

కూర్మరూపము నొంది కొండమూపునదాల్చి
కూర్మితో నమృతంబుగూర్చి రామప్రభో పా ॥

వరాహరూపమున వసుధగొమ్ముననెత్తి
సురల రక్షించు దాశరథి రామప్రభో పా ॥

శరణన్న ప్రహ్లాదు గరుణించి రక్షింప
నరసింహమూర్తివైనట్టి రామప్రభో పా ॥

వామనత్వమున భూదానమడిగియు బలిని
భూమిక్రిందనడంచి పొల్చు రామప్రభో పా ॥

పరశురాముడనంగ నరపాలకులనెల్ల
నరసిపొరికొన్న దాశరథి రామప్రభో పా ॥

శ్రీరామమూర్తివై యారావణుని తలల్‌
ధారుణిన్‌ పడగూర్చినావు రామప్రభో పా ॥

హలధరుడవై ధరాస్థలిపాలకులనెల్ల
బొరిపుచ్చి వెలుగుమాపాలి రామప్రభో పా ॥

సిద్ధసన్నుత మనోబద్ధుండవై నీవు
బౌద్ధుండవైతి ప్రబుద్ధ రామప్రభో పా ॥

కలికిరూపముదాల్చి కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రినిలయ రామప్రభో పా ॥

అవ్యయుడవైన నీయవతారముల జూచి
దివ్యులైనారు మునులయ్య రామప్రభో పా ॥

శ్రీరామనామమే వేళస్మరియింతు
స్వామి దయచేయు సంపదను రామప్రభో పా ॥

అప్ప శేషశయన యెప్పుడు నిను మరువ
నొప్పుగా బ్రోవు వరదప్ప రామప్రభో పా ॥

తెప్పరంబులుదీర్చి యిప్పుడేమరక నన్‌
ద్రిప్పు బెట్టక చేపట్టు రామప్రభో పా ॥

పట్టాభిరామ నీపాదపద్మాశ్రయుల
పాలింపుమా భద్రశైలి రామప్రభో పా ॥

పట్టాభిరామ నిను ప్రభుడవని నమ్మితిని
కష్టపెట్టకను చేపట్టు రామప్రభో పా ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Pahi Rama Prabho Lyrics in English

Other Ramadasu Keerthanas: