భద్రాచల రామదాసు కీర్తనలు
॥ Raman na Manavini Lyrics ॥
అసావేరి – చాపు
పల్లవి:
రామ నా మనవిని చేకొనుమా దైవ ల
లామ పరాకు చేయకుమా రా ॥
అను పల్లవి:
స్వామి భద్రాచలధామ పావన దివ్య
నామ గిరిజనుత భీమ పరాక్రమ రా ॥
చరణము(లు):
దరిలేని జనులను గాచే
బిరుదు పూనితివి ఖ్యాతిగాను
బరువగు నాబాధలను దీర్ప నీ
మరుగు జేరితి న న్నరమరచేయకు రా ॥
కపటమానసుడని మదిని యెన్న
కిపుడు రక్షింపు సమ్మతిని
అపరాధములకు నే నాలయమైతిని
కృపజూడుము నన్ను నెపములెన్నకు రా ॥
పతితపావన మూర్తివైన నీవే
గతియని యుండితి మదిలోన
సతతము రామదాస పతివై భద్రాద్రిని
అతులిత వైభవతతులచే నెలకొన్న రా ॥