Ramula Divyanamasmarana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ramula Divyanamasmarana Lyrics ॥

సావేరి – ఆది

పల్లవి:
రాముల దివ్యనామస్మరణ జేయుచున్న జాలు
ఘోరమైన తపములను కోరనేటికే మనసా తారక
శ్రీరామనామ ధ్యానము గానముజేసి
వేరుదైవములను వెదుకనేటికే మనసా రా ॥

చరణము(లు):
భాగవతుల పాదజలము పయిన జల్లుకొన్న జాలు
బాగుమీరినట్టి యమృతపానమేటికే మనసా రా ॥

పరుల హింసచేయకున్న పరమధర్మ మంతేచాలు
పరులను రక్షింతునని పల్కనేటికే మనసా రా ॥

దొరకని పరుల ధనము దోచకయుండిన చాలు
గురుతుగాను గోపురము గట్టనేటికే మనసా రా ॥

పరగ దీనజనులందు పక్షముంచినను చాలు
పరమాత్మునియందు ప్రీతిపెట్టనేటికే మనసా రా ॥

హరిదాసులపూజ లాచరించిన జాలు
హరినిపూజ చేయుటనెడి యహమదేటికే మనసా రా ॥

జపతపానుష్ఠానములు చేసి మూఢులకైవడి బంధులు
జగదీశుని దివ్యనామ చింతకోసమైన మనసా రా ॥

చలములేక ఏవేళ చింతించె మహాత్ములకు
జపతపానుష్ఠానములు చేయనేటికే మనసా రా ॥

అతిథివచ్చి యాకలన్న నన్నమిడినదే చాలు
క్రతువు చేయవలయుననెడి కాంక్షలేటికే మనసా రా ॥

సతతము మన భద్రగిరిస్వామిని నమ్మినచాలు
ఇతర మతములనియెడి వెతలదేటికే మనసా రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Rakshinchu Rakshinchu In Telugu – Sri Ramadasu Keerthanalu