Sreerama Namame Jihvaku In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Sreerama Namame Jihvaku Lyrics ॥

ధన్యాసి – ఆది (అఠానా – తిశ్ర ఏక)
పల్లవి:
శ్రీరామనామమే జిహ్వకు స్థిరమై యున్నది యున్నది
శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది యున్నది శ్రీ ॥

చరణము(లు):
ఘోరమైన పాతకముల గొట్టేనన్నది మిమ్ము
జేరకుండ ఆపదల జెండేనన్నది అన్నది శ్రీ ॥

దారి తెలియని యమదూతలను తరిమెనన్నది అన్నది శ్రీమ
న్నారాయణ దాసులైనవారికి అనువై యున్నది యున్నది శ్రీ ॥

మాయావాదుల పొందిక మానమన్నది అన్నది మీ
కాయము లస్థిరములని తలపోయుడన్నది అన్నది శ్రీ ॥

బాయక గురురాయని బోధ చేయుడన్నది అన్నది
ఏ యెడజూచినగాని తాను ఎడబాయకున్నది ఉన్నది శ్రీ ॥

కామక్రోధ మోహాంధకారముల మానుడన్నది అన్నది
మోదముతో పరస్త్రీల పొందు మోసమన్నది అన్నది శ్రీ ॥

వలదని దుర్విషయముల వాంఛ విడుడన్నది అన్నది నీ
తలపున హరిపాద కమలములుంచ తగునని అన్నది అన్నది శ్రీ ॥

కోపమనియెడి ప్రకృతిని కొట్టుమన్నది అన్నది
యిపుడు ప్రాపు నీవేయనిన దారిజూపెదనన్నది అన్నది శ్రీ ॥

ఏపుమీర నొరుల దోషము లెన్నకన్నది అన్నది
ఏ పాపబంధముల పట్టుపడవద్దని అన్నది అన్నది శ్రీ ॥

భక్తి భావము తెలిసి మీరు బ్రతుకుడన్నది అన్నది పరమ
భక్తులకు సేవజేయుచు ప్రబలుడని అన్నది అన్నది శ్రీ ॥

ముక్తిమార్గమునకు ఇదే మూలమన్నది అన్నది
భక్తుడు భద్రాచల రామదాసుడన్నది అన్నది శ్రీ ॥

Other Ramadasu Keerthanas:

See Also  108 Names Of Shiva Kailasa – Ashtottara Shatanamavali In Telugu