॥ Jaya Lakshmi Vara Lakshmi Telugu Lyrics ॥
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ।
ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా ॥
పాలజలనిధిలోని పసనైనమీఁగడ
మేలిమితామరలోని మించువాసన ।
నీలవర్ణునురముపై నిండిననిధానమవై
యేలేవు లోకములు మమ్మేలవమ్మా ॥
చందురుతోడఁ బుట్టిన సంపదలమెఱుఁగవో
కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లి ।
అందినగోవిందునికి అండనే తోడునీడవై
వుందానవు మాఇంటనే వుండవమ్మా ॥
పదియారువన్నెలతో బంగారుపతిమ
చెదరనివేదములచిగురుఁబోడి ।
యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు
నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ॥
– Chant Stotra in Other Languages –
Annamacharya Keerthanalu » Jaya Lakshmi Vara Lakshmi Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil