Abbabba Rama Namam Atyadhbutam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Abbabba Rama Namam Atyadhbutam Lyrics ॥

ధన్యాసి – చాపు( – ఆది)

పల్లవి:
అబ్బబ్బా రామనామం అత్యద్భుతము
గొబ్బున నే భాగ్యశాలికబ్బునో రామనామమది అ ॥

చరణము(లు):
సారములేని సంసారసాగరమీదే రామనామం
పారదోలు మున్నూటరువది భవరోగములన్నీ అ ॥

చేరి పంచేంద్రియములన్ని చేరనియ్యదు రామనామం
ఘోరమైన యమదూతలకొట్టెడిది రామనామం అ ॥

దినదినము జిహ్వకింపై దీయగనుండు రామనామం
ధనకనక వస్తువులు దయచేయు రామనామం అ ॥

ముక్కంటిసతికి శాశ్వతకీర్తినిచ్చే రామనామం
ఎక్కువై వాల్మీకిఋషికి యెప్పుడనుష్ఠాననామం అ ॥

కామక్రోధలోభ మోహగర్వంబణచు రామనామం
స్వామి భద్రగిరీశుని సద్గతి శ్రీరామనామం అ ॥

నీమముతో బిలిచినను నిత్యమోక్ష పదవినామం
రామదాసునేలిన శ్రీరామచంద్రునినామం అ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Ramanama Mandukonare In Telugu – Sri Ramadasu Keerthanalu