Adaranaleni Ramamantra Pathanamadrija In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Adaranaleni Ramamantra Pathanamadrija Lyrics ॥

కల్యాణి – రూపక ( – త్రిపుట)

పల్లవి:
ఆదరణలేని రామమంత్ర పఠనమద్రిజ ఏమనిచేసెను రామా
అదెనీకు నామీద ముదమొప్ప దయయున్న అదె తెలిపి మాటాడవా శ్రీరామా ఆ ॥

చరణము(లు):
పరమద్రోహివి నిన్ను పతితపావనుడని ప్రహ్లాదుడెటువలె తలచెనో
పరమపావనసతి నడవికి పంపిన పాపకర్మునకెటు దయవచ్చునో రామా ఆ ॥

ఆది పరబ్రహ్మమనుచు నిను పరమేష్ఠి ఏరీతి ప్రస్తుతి చేసెనో
వద్దు పరసతులనక స్త్రీల భంగపరచినవాని వరలక్ష్మి ఎటుమెచ్చెనో రామా ఆ ॥

ఎన్నగ శబరియెంగిలి భక్షించిన తిన్నని నడత లేనివాడవు
నిన్ను నమ్మరాదు నిన్నుదైవమనరాదు నిజము నామాట రామా ఆ॥

ఆదరణలేని రామమంత్రము ఆడితిని నినుదూరితిని
ముద్దుమాటలుగాని మూర్ఖవాదముగాదు మురహర ననుగావుమీ రామా ఆ॥

ముద్దుమోముజూపి ముదమొప్ప రక్షించు భద్రశైల పరిపాలకా
వద్దురా కృపనేలు రామదాసునిమీద వైరమా వైదేహిసహిత శ్రీరామా ఆ॥

Other Ramadasu Keerthanas:

See Also  Shri Subramanya Moola Mantra Stava In Telugu