Allaa….Sriramaa » Sri Ramadasu Movie Song In Telugu

భద్రాచల రామదాసు కీర్తనలు

 ॥ Allaa….sriramaa Telugu Lyrics ॥

అల్లా….శ్రీరామా….
శుభకరుడు సురుచిరుడు భవహరుడు
భగవంతుడెవడూ
కళ్యాణగుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా
అలరారు అందాల చంద్రుడెవడూ
ఆనంద నందనుడు అమృతరసచందనుడు
రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీరామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం(2)

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జేగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘన మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
ఆ మూర్తి ఏమూర్తియును గాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామ చంద్రమూర్తి
తాగరా….తాగరా శ్రీనామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం(2)
పాపాప మపనీప మపనీప
మపసనిప మాపామా శ్రీరామా
పాపాప మపనీని పనిసాస రిరిసనిప
మాపాని మపమా కోదండరామా ..
మపనిసరిసానీ పానీపామా సీతారామా
మపనిసరిసారీ సరిమరిస నిపమా
ఆనంద రామా
మా…మా….రిమరిమరిసరిమా
రా…మా..జయ…రా…మా…
సరిమా రామా…సపమా…రామా..
పావన నామా

ఏ వేల్పు ఎల్లవేల్పులను గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కలుపు
ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పుదేమల్పు లేని గెలుపు
ఏ వేల్పు సేతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసానుదాసులకు కైమోడ్పు
తాగరా…తాగరా శ్రీరామనామామృతం…
ఆ నామమే దాటించు భవసాగరం

See Also  Shri Subramanya Pancharatnam In Telugu

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Movie Song » Allaa….sriramaa Song Lyrics » English

Other Ramadasu Keerthanas: