Ammamma Emamma In Telugu

॥ Ammamma Emamma Telugu Lyrics ॥

అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ ।
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ॥

నీరిలోన తల్లడించే నీకే తలవంచీ
నీరికింద పులకించీ నీరమణుండు ।
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ॥

నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెంచీని ।
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ॥

చక్కదనములె పెంచీ సకలము గాలదంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని ।
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Ammamma Emamma Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  1000 Names Of Sri Bala 1 – Sahasranamavali Stotram In Tamil