Antaa Ramamayambee Jagamanta In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

 ॥ Antaa Ramamayambee Lyrics ॥

వరాళి – ఆది

పల్లవి:

అంతా రామమయంబీ జగమంతా రామమయం అం ॥

చరణం:

అంతరంగమున నాత్మారాముం డ
నంతరూపమున వింతలు సలుపగ అం ॥

చరణం2: సోమసూర్యులును సురలును తారలును
ఆ మహాంబుధులు నఖిల జగంబులు అం ॥

చరణం3: అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ అం ॥

చరణం4: నదులు వనంబులు నానామృగములు
విదితకర్మములు వేదశాస్త్రములు అం ॥

చరణం5: అష్టదిక్కులును నాదిశేషుడును
అష్టవసువులును నరిషడ్వర్గము అం ॥

చరణం6: ధీరుడు భద్రాచల రామదాసుని
కోరిక లొసగెడి తారకనామము అం ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Antaa Ramamayambee Jagamanta Lyrics » English

Other Ramadasu Keerthanas:

See Also  Sri Kamakshi Stotram In Telugu