Asaputte Sriīramulato Aha Na In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Asaputte Sriīramulato Aha na Lyrics ॥

ఆనందభైరవి – ఏక

పల్లవి:
ఆశపుట్టె శ్రీరాములతో ఆహా నే పుట్టనైతి
రఘురాములతో నే పుట్టనైతిని
శ్రీరాములతో బుట్టి సేవలు సేయగనైతిని ఆ ॥

చరణము(లు):
దశరథనందనులై దాశరథి రాముల వశముగ బాలురతో
వరదుడై యాడంగ వనజనాభునకు దాసుడనై నే భయభక్తితోడ
సకల సేవలు సల్పుచు మఱియును
అకట నలుగురితో నాడుకొందుగద ఆ ॥

అయోధ్యాపురిలో గజమునెక్కి
అచ్యుతుండురాగాను నాట్యమాడుచు
నన్ను రక్షింపుమందును విశ్వామిత్రుని వెంటపోగా నేపోదును
జనకుడు హరికి జానకిని పెండ్లిచేయగ వారిద్దరికి నే శేషబియ్యమునిత్తును ఆ ॥

అమ్మవారికి ఆకులు మడిచి యిత్తును
నరులార యితడే నారాయణుడని నే చాటుదును
మనలను రక్షించే మాధవుడు వచ్చెనందును
మనగతి యేమందు ప్రభుదశరథు నే బతిమాలుదుగద ఆ ॥

కైకేయిని నేగాదనందుగద
రామునికైన రాజ్యమిత్తుగద
ప్రభువయి యేలగ నొనర్తుగద
అడవికిపోగ నంటిపోదుగద ఆ ॥

గుహునితో గూడుక కూడి మురియుదుగద
నిలిచిదానవుల నెత్తిగొట్టుదుగద
కరయుద్ధంబున గౌగిలింతుగద
కనకమృగము రాగ గాంత తెమ్మంటె ఓ నిర్దయులార అయ్యోనేపోయి ఆ ॥

ఆమృగమును దెచ్చి అమ్మకిత్తుగద
హరినినేను పోవద్దందునుగద
ఆమృగము వెంటదశముఖుడంతట తపోవేషమున
దశముఖుతన శౌర్యముజూడగ జానకివణకగ ఆ ॥

ఆరావణుడు సీతమ్మను చెఱపట్టగ
అప్పుడు నేనుంటె అమ్మ కభయమిత్తును
ఆశ్రిత పాదములు నట్టెపట్టుకనే మ్రొక్కుమను
హరిదుఃఖింపగ అమ్మజాడదెత్తును ఆ ॥

సర్వజ్ఞమూర్తి చాలు నీవిరహమందును
విశ్వములోనందరు విననట్లూరుకుండిరి
సురవరులందరు సుఖంబుగ చూచుచుండిరి
అయ్యో యిదేమని ఆబ్రహ్మాదుల శపింతునుగద ఆ ॥

See Also  108 Names Of Tulasi 2 – Ashtottara Shatanamavali In Telugu

మిత్రవంశున కేమిచేయును నే నెవ్వరివేడుదు
ఏమరియుండిరి మానిసులందరు
ఏలపోయెనో యా క్షీరాబ్ధికి
ఏల దశరథుఁడు యజ్ఞముచేసెను ఆ ॥

ఎందుకు బుట్టిరి యీలోకమునను
ఎందుకువచ్చిరి యీవనమునకును
ఇట్టి వరముల నేలవేడిరి
యెక్కడనోపదు ఇంతటిజాలి ఆ ॥

పంపాతీరమున బరిమార్చిరి కబంధుని
ఇంపుగ శబరివిందులు యిష్టముతోజేసి
ఇంద్రసూనునికి హితవు గావించి
ఆంజనేయాంగద ముఖ్యాదులు ఆ ॥

మంజులవాణికి మరువక వెదకగ
వారలతోగూడి వెదకుదుగద
వైదేహిని ప్రేమతోను
సహాయముగ రమ్ము సంపాతిపోకముందును ఆ ॥

సముద్రమునే చౌకళించి వేగదుముకుదును
లంకను గాలించి పంకజాక్షిని నే సేవింతును
అంగుళీయకమిచ్చి అమ్మా హరియిచ్చెనందును
ఆ వృత్తాంతము హరికి నే విన్నవింతును ఆ ॥

జానకీరామ జాగేల లేలెమ్మందును
అపరాధిని నేనని వారికి వాహనము ఆంజనేయుడ
ఆ లక్ష్మణునకు అంగదరాజ
ప్రభురాములనే ప్రార్థించెదను గద ఆ ॥

సేనలగూడుక చెండాడుదుగద
కపులచే వారధి గట్టింతుగద
సముద్రుడా యిది సమయమందుగద
హరిసేవతో పనులాచరింతుగద ఆ ॥

వలీముఖులకుగల బలము జూతుగద
శుభరామునితో సొంపుకందుంగద
లక్ష్మణాగ్రజుడు సేనను రావించి
లక్ష్మికొరకు కపిలంక జుట్టంగ ఆ ॥

రక్షించు భద్రాద్రివాస దాసుడనై
రణములో రావణుని ద్రుంతును
ఆ క్షణమున రఘువరునప్పుడే
నే బిలుతును మంగళపతివ్రతను ఆ ॥

మాధవుకర్పించి మురియుదును
అమ్మకు మారుగ అగ్నిలో జొత్తును
ఆ పుష్పకమెక్కి హరితో నయోధ్యకు బోదును
భరతు డానందభరితుడై వేడుకొనగ ఆ ॥

భోరున వాద్యములు భువనములునిండి మ్రోయగ
పట్టాభిషేకము పరమఋషులు సేవింపగ
జలజాక్షులు జయములు పాడంగ
రాముల తొడపై లక్ష్మియుండగ ఆ ॥

See Also  Lord Shiva Ashtakam 6 In Telugu

లక్ష్మణానుజులు వింజామర విసరగా
వాయుసుతుడు పదవనజము లొత్తగా
జేరి విభీషణ మహాత్మయనగా
ఆర్ధికపులు హరిగోవిందయనగా ఆ ॥

బ్రహ్మాదులు హరి ప్రస్తుతింపగా
తల్లి మారుతికి దండవేయగా
నాతల్లియప్పుడు నాకు వేయునుగద
కష్టపడితినని కరుణించునుగద సీతారాములు సిరులిత్తురు గద ఆ ॥

Other Ramadasu Keerthanas: