Ayyayyo Nivanti Anyayadaivamu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ayyayyo Nivanti Anyayadaivamu Lyrics ॥

ముఖారి – త్రిపుట

పల్లవి:
అయ్యయ్యో నీవంటి అన్యాయదైవము
నెయ్యడగాననయ్య శ్రీరామయ్య అ ॥

అను పల్లవి:
ఇయ్యెడ నేను కుయ్యడిన ఆలకించ
వయ్యయ్యో యేమందు అయ్యా రామచంద్ర అ ॥

చరణము(లు):
ఎంతని వేడుదు ఎంతని పాడుదు
ఎంతని దూరుదు ఏమిసేతు రామ
సుంతైనగాని నీ అంతరంగమదేమో
వింత కరుగదు ఎంతో నమ్మినందుకు అ ॥

శరణన్న జనముల బిరబిర బ్రోచేటి
బిరుదు గలిగినయట్టి దొరవని నే నీ
మరుగు జొచ్చినందు కరమర జేయుట
పరువే కరుణింప బరువే హరి హరి అ ॥

కామిత మందార కలుష విదూర
తామసమేల తాళజాలనురా నీ
మోము జూపుము స్వామి భద్రాచల
రామదాసుని ప్రేమ రయమున నేలుము అ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Bilvashtakam 2 In Telugu