Bahukalamunaku Sri Bhadracalasesunaku In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Bahukalamunaku Sri Bhadracalasesunaku Lyrics ॥

కాంభోజి – ఆది

పల్లవి:
బహుకాలమునకు శ్రీభద్రాచలశేషునకు పాదసేవకుడనైతి
అహహ నా జన్మము సఫలమాయె నేటికిని
అనుమానములు దీరె నికను తగను బ ॥

చరణము(లు):
తల్లి గర్భమునందు మల మూత్రముల మునిగి ధరణిపై జన్మించితి
కల్లలాడుచు పాపకర్మము లొడిగట్టి కామపురుషులను జేరితి నీవేగతి బ ॥

కోపుడను పాపుడను గుణహీనుడను నేను క్రూరుడను కుత్సితుడను
రాపుచేయక నన్ను రక్షింపదలచు శ్రీరామచంద్రునకు భారమాయింకను బ ॥

అఖిలలోకంబులకు నాధారమైయున్న యాది పురుషోత్తముండు
సకియతో గూడిన సమయమందుజేరి సన్నుతులు చేయగలిగె తొలుగ
రామదాసుని నేలుకొరకై శ్రీ భద్రాద్రిధాములై యుదయించి
యేమి కొదవలు మనకు నెరుగ గలుగజేసె స్నేహంబు నితరమెల్ల కల్ల బ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Shadanana Ashtakam In Telugu