Bhaavamu Lona In Telugu

॥ Bhaavamu Lona Telugu Lyrics ॥

భావములోనా బాహ్యమునందును ।
గోవింద గోవిందయని కొలువవో మనసా ॥

హరి యవతారములే యఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాండంబులు ।
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా ॥

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు ।
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా ॥

అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే యసురాంతకుడు ।
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Bhaavamu Lona Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Sri Gayatri Bhujanga Stotram In Tamil