Bharamulannitiki Nive Yanucu Nirbhayudanai In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Bharamulannitiki Nive Yanucu Lyrics ॥

ఆనందభైరవి – ఆది (-త్రిపుట)

పల్లవి:
భారములన్నిటికి నీవె యనుచు నిర్భయుడనై యున్నానురా రామ భా ॥

అను పల్లవి:
దారిదప్పక నీవు దరివని ధైర్యముదోచినదిరా శ్రీరామా భా ॥

చరణము(లు):
అతిదుష్కృతముల నేనెన్నో చేసితిని
అయిన మరేమాయెరా రామా
పతితపావనుడను బిరుదు వహించిన నీ
ప్రఖ్యాతి విన్నానురా శ్రీరామా భా ॥

ఏరీతినైన నే నిన్ను నమ్మియున్నాడ న
న్నేలుకొనుట కీర్తిరా రామా
నేరను నేరము లెంచి చూచుటకు
నే నెంతవాడనుర శ్రీరామా భా ॥

మును నినుచేరి కృతార్థులైనవారి
ముచ్చట విన్నానురా రామా
విని విననట్లున్నావేమిరా పలుమారు
విన్నవించ నేరనురా శ్రీరామా భ ॥

శరణన్నవారి రక్షణచేయు బిరుదు
నిశ్చయమై నీకున్నదిరా రామా
మురిపెముగా నన్నిటికి నే పట్టినది
మునగకొమ్మకాదురా శ్రీరామ భా ॥

బహువిధముల నిన్ను బ్రస్తుతించమని
బ్రహ్మవ్రాసినాడురా రామ
విహిత జనములలో నేనెవ్వడో యని
వేరుచేయక బ్రోవరా శ్రీరామా భా ॥

వాసిగ భద్రాచలేశుడవని చాల
వర్ణించుచున్నానురా రామా
భాసురముగ రామదాసు నేలునట్టి
భావముగన్నానురా శ్రీరామా భా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Hymn To Kottai Ishvara In Telugu