Bidiyamelanika Moksamicci In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Bidiyamelanika Moksamicci Lyrics ॥

మధ్యమావతి – ఆట (కేదారగౌళ – ఆది)

పల్లవి:
బిడియమేలనిక మోక్షమిచ్చి నీవడుగుదాటి పోరా రామా
తడవాయెను నేనోర్వలేను దొరతనము దాచుకోరా రామా బి ॥

చరణము(లు):
మురియుచు నీధర జెప్పినట్లు విన ముచికుందుడ గాను రామా
అరుదుమీరలని తలచి ఎగురగా హనుమంతుడ గాను రామా
సరగున మ్రుచ్చుల మాటలు విన జాంబవంతుడను గాను రామా
బిరబిర మీ వలలోబడ నేనా విభీషణుడ గాను రామా బి ॥

మాయలచేత వంచింపబడగ నే మహేశుడను గాను రామా
న్యాయములేక నే నటునిటు దిరుగను నారదుండ గాను రామా
ఆయము చెడి హరి నిను గని కొలువను నర్జునుండ గాను రామా
దాయాదుండని మదిలో మురియను దశరథుడను గాను రామా బి ॥

గరిమతోడ మాసీతను గాచిన గొప్పలు నే వింటి రామా
పరగ భద్రగిరి శిఖరనివాసా పర బల సంహార రామా
నరహరి నను రక్షింపుమయా శ్రీనారాయణరూపా రామా
మరచి నిదురలోనైనను మీపద సరసిజములు విడువ రామా బి ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Chandra Ashtottarashatanama Stotram In Telugu