Ekkadi Karmamuladdupadeno Yemiseyuduno In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ekkadi Karmamuladdupadeno Yemiseyuduno Lyrics ॥ కాంభోజి – ఆది (త్రిపుట) పల్లవి:ఎక్కడి కర్మములడ్డుపడెనో యేమిసేయుదునో శ్రీరామాఅక్కట నాకన్నుల నెప్పుడు హరి నినుజూతునో శ్రీరామా ఎ ॥ చరణము(లు):ప్రకటమాయెను పాపములెటుల బాధకోర్తును శ్రీరామాసకలలోక రాజ్యపదవికి ఎక్కువైనయట్టి శ్రీరామా ఎ ॥ పృథివిలోన పూర్వజన్మల పూజలింతేగా శ్రీరామావిధులు జరుపవలయు విషయవాంచలు దలుపక శ్రీరామా ఎ ॥ మూడు నెలలాయె నీ మునుముందర నిల్వక శ్రీరామాఎన్నడిట్లుండి రాఘవ నేనెరుగ నను గన్నయ్యా శ్రీరామా ఎ … Read more

Yenduku Dayaradu Sri Rama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Yenduku dayaradu Sri Rama Lyrics ॥ ఆనందభైరవి – తిశ్ర ఏక పల్లవి:ఎందుకు దయరాదు శ్రీరామనేనేమి చేసితి శ్రీరామ ఎం ॥ చరణము(లు):గతినీవే యనుకొంటి శ్రీరామ నావెత మాన్పవయ్య శ్రీరామ ఎం ॥ చేపట్టి రక్షింపవేల శ్రీరామనాప్రాపు నీవేనయ్య శ్రీరామ ఎం ॥ అయ్యయ్యో నానేరమేమి శ్రీరామ నాకుయ్యాలింపవయ్య శ్రీరామ ఎం ॥ ఇంక నీదయ రాకుంటె శ్రీరామ నాసంకట మెటుతీరు శ్రీరామ ఎం ॥ ఏండ్లు పండ్రెండాయెనే శ్రీరామ … Read more

Ento Mahanubhavudavu Neevu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ento Mahanubhavudavu Neevu Lyrics ॥ వరాళి – రూపక (శంకరాభరణ – త్రిపుట) పల్లవి:ఎంతో మహానుభావుడవు నీవుఎంతో చక్కని దేవుడవు ఎంతో ॥ వింతలు చేసితి వీలోకమందునసంతత భద్రాద్రిస్వామి రామచంద్ర ఎంతో ॥ చరణము(లు):తొలివేల్పు జాంబవంతుని చేసినావుమలివేల్పు పవనజుగా చేసినావువెలయ సూర్యు సుగ్రీవుగ చేసినావుఅలనెల్ల సురల కోతుల జేసినావు ఎంతో ॥ కారణ శ్రీ సీతగ జేసినావుగరిమశేషుని లక్ష్మణుని జేసినావుఆ రెంటి భరత శత్రుఘ్నుల జేసినావునారాయణ నీవు నరుడవైనావు ఎంతో … Read more

Enta Pani Chesitivi Rama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Enta Pani Chesitivi Rama Lyrics ॥ నాదనామక్రియ – ఝంప చరణము(లు):ఎంతపని చేసితివి రామ నిన్నేమందునిన్నేమందు సార్వభౌమ రామపంతమా నామీద పరమపావన నామసంతోష ముడిపితివి సకలసద్గుణధామ ఎం ॥ నిన్నె దైవంబనుచు నమ్మి రామతిన్నగా దుఃఖముల జిమ్మి రామకన్నదినమని నెమ్మి నిన్ను సేవింపగానన్నిట్లు నట్టేట ముంచు టెరుగకపోతి ఎం ॥ అన్నన్న మాటాడవేరా నీకన్నులను నను జూడవేరా రామచిన్నెలన్నియు దరిగియున్న ఈ చిన్నన్నగ్రన్న నను జూడుమాయన్న ఓ రామన్న ఎం … Read more

Unnado Ledo Bhadadri In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Unnado Ledo Bhadadri Telugu Lyrics ॥ అసావేరి – త్రిపుట పల్లవి:ఉన్నాడో లేడో భద్రాద్రియందు ఉ ॥ చరణము(లు):ఉన్నాడో లేడో యాపన్న రక్షకుడుఎన్నాళ్ళు వేడిన కన్నుల కగపడడు ఉ ॥ నన్నుగన్న తండ్రి నా పెన్నిధానమువిన్నపము విని తా నెన్నడు రాడాయె ఉ ॥ ఆకొని నే నిపుడు చేకొని వేడితేరాకున్నా డయ్యయ్యో కాకుత్స్థ తిలకుడు ఉ ॥ వాటముగ భద్రాచల రామదాసుతోమాటలాడుటకు నాటకధరుడు ఉ ॥ – Chant … Read more

Innikalgi Mirurakunna Nenevarivadanaudu Rama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Innikalgi Mirurakunna Nenevarivadanaudu Rama Lyrics ॥ కల్యాణి – చాపు ( – ఆది) పల్లవి:ఇన్నికల్గి మీరూరకున్న నేనెవరివాడనౌదు రామ ఇ ॥ అను పల్లవి:కన్నతండ్రివలె రక్షించుటకును కరుణ యేలరాదు రామ ఇ ॥ చరణము(లు):అక్షయమియ్యగ దలచిన శ్రీమహాలక్ష్మీదేవి లేదా రామారక్షింపగ నెంచిన భూదేవియురత్నగర్భగాదా రామా ఇ ॥ పక్షపాత మెడలింపగ చేతిలోపరుసవేది లేదా రామాఈ క్షణమున దయగలిగిన సంచితధనమున్నది గాదా రామా ఇ ॥ కనుగొని నిర్హేతుక కృప … Read more

Inakula Tilaka Yemmayya Ramayya In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Inakula Tilaka yemmayya Ramayya Lyrics ॥ ఆహిరి – త్రిపుట పల్లవి:ఇనకులతిలక ఏమయ్య రామయ్యాశ్రీరామచంద్రా విని వినకున్నావువినరాదా నామొర శ్రీరామచంద్రా ఇ ॥ చరణము(లు):కనకాంబరధర కపటమేలనయ్యాశ్రీరామచంద్రా జనకాత్మజా రమణాజాగుసేయకు శ్రీరామచంద్రా ఇ ॥ దశరథసుత నాదశ జూడవయ్యాశ్రీరామచంద్రా పశుపతి నుతనామప్రార్థించి మ్రొక్కెద శ్రీరామచంద్రా ఇ ॥ నీవేగతియని నెర నమ్మియున్నానుశ్రీరామచంద్రా కావవే యీవేళకాకుత్స్థ కులతిలక శ్రీరామచంద్రా ఇ ॥ వైకుంఠవాసుడ విని బాధ మాన్పవేశ్రీరామచంద్రా నీకంటె గతిలేరునిర్దయజూడకు శ్రీరామచంద్రా ఇ … Read more

Idigo Bhadradri In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Idigo Bhadradri Gautami Adigo Lyrics ॥ వరాళి – ఆది (మోహన – ఆది) పల్లవి:ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండిముదముతో సీత ముదిత లక్ష్మణులుకలసి కొలువగా రఘుపతియుండెడి ఇది ॥ చరణము(లు):చారుస్వర్ణప్రాకార గోపురద్వారములతో సుందరమైయుండెడి ఇది ॥ అనుపమానమై యతిసుందరమైదనరుచక్రమది ధగధగ మెరిసెడి ఇది ॥ కలియుగమందున నిలవైకుంఠమునలరుచునున్నది నయముగ మ్రొక్కుడి ఇది ॥ పొన్నల పొగడల పూపొదరిండ్లతొచెన్నుమీరగను చెలగుచునున్నది ఇది ॥ శ్రీకరముగ శ్రీరామదాసునిప్రాకటముగ బ్రోచే ప్రభువాసము … Read more

Itadena Ee Lokamulo Gala In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Itadena ee Lokamulo Gala Lyrics ॥ శంకరాభరణ – త్రిపుట పల్లవి:ఇతడేనా ఈ లోకములో గలపతితుల నెల్లను పావనము చేయువాడు ఇ ॥ చరణము(లు):పరిపూర్ణకరుణచే బ్రహ్మాదుల గాచిననరసింహుడైనట్టి నళినదళేక్షణుడు ఇ ॥ ఇల లంకపురమున అవనిజను బ్రోవబలుడైన రావణుని పరిమార్చినవాడు ఇ ॥ అలనాడు ద్రౌపతికి అక్షయవలువలువల నొప్పనొసగిన వైకుంఠవాసుడు ఇ ॥ ఏ వేళ మునివరులు నితర చింతలు మానికేవలము మదినుంచి కొలువు గాచెడువాడు ఇ ॥ ప్రేమను … Read more

Iksvsku Kulatilaka Ikanaina Palukave Ramacandra In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Iksvsku Kulatilaka Ikanaina Palukave Lyrics ॥ కాంభోజి – ఆది (- త్రిపుట) పల్లవి:ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్నురక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా ఇ ॥ చరణము(లు):చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రాఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ ॥ గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా ననుక్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా ఇ ॥ భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రాఆ పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ … Read more