Charanamulane » Sri Ramadasu Movie Song In Telugu

భద్రాచల రామదాసు కీర్తనలు

 ॥ Charanamulane Telugu Lyrics ॥

చరణములే నమ్మితీ.నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ.నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ.

వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా
నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ.

పావన రామ నామ సుధా రస పానము చేసే దెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తము నెంచే దెన్నటికో

రామ రామ జయ సీతా రామా రఘుకుల సోమ రణభీమా
రామ రామ జయ సీతా రామా జగదభి రామా జరరామా

చంచల గుణములు మాని సదా నిశ్చల మదియై నుండే దెన్నటికో
పంచ తత్వములు తారక నామము పఠియించుట నాకెన్నటికో

రామ రామ జయ సీతా రామా రఘుకుల సోమ రణభీమా
రామ రామ జయ సీతా రామా జగదభి రామా జరరామా

నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ వృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ వృందలోలం

జలజ సంభవాది వినుతా.

జలజ సంభవాది వినుతా.
జలజ సంభవాది వినుతా.
జలజ సంభవాది వినుతా.
జలజ సంభవాది వినుతా.
చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధ వదనా నళినా మిళిందం

నందబాలం భజరే నందబాలం
బౄందావన వాసుదేవ వృందలోలం
నందబాలం భజరే నందబాలం
బౄందావన వాసుదేవ వృందలోలం

శ్రీరామ నామం మరువాం మరువాం . సిద్దము యమునికి వెరువాం వెరువాం
శ్రీరామ నామం మరువాం మరువాం . సిద్దము యమునికి వెరువాం వెరువాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం .
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం .
దేవుని గుణములు తలుతాం తలుతాం .
దేవుని గుణములు తలుతాం తలుతాం .
శ్రీరామ నామం మరువాం మరువాం . సిద్దము యమునికి వెరువాం వెరువాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం

See Also  Sri Shiva Mahima Ashtakam In Telugu

శ్రీరామ నామం మరువాం మరువాం . సిద్దము యమునికి వెరువాం వెరువాం

హే జై జై రామా.జానకి రామా
జై జై రామా.జానకి రామా
పావన నామా.పట్టాభి రామా
పావన నామా.పట్టాభి రామా
నిత్యము నిన్నే.కొలిచెద రామా
అహ నిత్యము నిన్నే.కొలిచెద రామా
ఆహా రామా.అయోధ్య రామా
ఆహా రామా.అయోధ్య రామా
రామా రామా.రఘుకుల సోమా
అహ రామా రామా.రఘుకుల సోమా
జై జై రామా.జానకి రామా
జై జై రామా.జానకి రామా
జై జై రామా.జానకి రామా

రామా.రామా

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Movie Song » Charanamulane Song Lyrics » English

Other Ramadasu Keerthanas: