Charanamule Nammithi In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Charanamule Nammithi Lyrics ॥

కాపీ – ఆది

పల్లవి:
చరణములే నమ్మితి నీదివ్యచరణములే నమ్మితి చ ॥

చరణము(లు):
వారధిగట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా నీదివ్య చ ॥

ఆదిశేష నన్నరమర చేయకు మయ్యా అయ్యా అయ్యా నీదివ్య చ ॥

వనమున రాతిని వనితగ చేసిన చరణం చరణం చరణం నీదివ్య చ ॥

పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి పట్టితి నీదివ్య చ ॥

వెయ్యారు విధముల కుయ్యాలించిన అయ్యా అయ్యా అయ్యా నీదివ్య చ ॥

బాగుగ నన్నేలు భద్రాచల రామదాసుడ దాసుడ దాసుడ నీ దివ్య చ ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Charanamule Nammithi Lyrics » English

Other Ramadasu Keerthanas:

See Also  Narasimhapurana Yamashtakam In Telugu