Daivamani Miraleka Yinta Talitigaka In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Daivamani Miraleka Yinta Lyrics ॥

పంతువరాళి – ఆట (సింహేంద్రమధ్యమ – త్రిపుట)
పల్లవి:
దైవమని మీరలేక యింత తాళితిగాక పరాకా శ్రీరామా దై ॥

అను పల్లవి:
దేవుడవని నిన్ను దీనతవేడితి
కావక విడచిన కారణమేమో దై ॥

చరణము(లు):
కొలువున నిలిపిన వాడవు నీవు
తలపవేమి బడాయి నిలిచిన జీతంబీవోయీ
కులుకుచు తిరిగేవు సీతాదేవి తురాయి
ఆలసించకురా నీ బంట నన్నెరుగరా దై ॥

మూల దూరుక తలజూప వదేమ నీ సాటి వా
రలు నగుదురనక పేదసాదలున్నారని బెదరి
మూలమగు డబ్బియ్యక అబ్బురముగను
ఏల బొబ్బరించి పెదవుల తడుపుకొనేవు దై ॥

కలిగియు తగవా నిన్నరికట్టుదు ఎదురుండు
చెలువమైన పూలదండ మెడజుట్టుదు కోదండరామ
ఇలలో నొకరికి యీవలసిన సొమ్మును
తలచిచ్చి రామదాసుని దండను తప్పించుము దై ॥

Other Ramadasu Keerthanas:

See Also  Narayaniyam Ekonatrimsadasakam In Telugu – Narayaneeyam Dasakam 29