Darisanamayenu Sriramulavari In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Darisanamayenu Sriramulavari Lyrics ॥

మేచబౌళి – త్రిపుట

పల్లవి:
దరిశనమాయెను శ్రీరాములవారి
దరిశనమాయెను దరిశనమాయెను ద ॥

చరణము(లు):
దరిశనమాయెను ధన్యుడనైతిని
యురమునందు సిరి మెరయుచున్నవాని ద ॥

శుకమునులకు యోగి ప్రభులకు నైనను
అభిముఖుడై యాననము జూపని వాని ద ॥

కండ క్రొవ్వున తను మరచువాని తల
చెండెదనని కోదండమెత్తిన వాని ద ॥

పరమభక్తుల కిల సిరులొసగెదనని
కరమున దాన కంకణము గట్టినవాని ద ॥

స్థిరముగ భద్రాచల రామదాసుని
అరసి బ్రోచెదనని బిరుదు దాల్చిన వాని ద ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Tripurarnavokta Varganta Stotram In Telugu