Dasaratharama Govinda Nannu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Dasaratharama Govinda Nannu Lyrics ॥

కాఫి – చాపు (శంకరాభరణ -ఆది)

పల్లవి:
దశరథరామ గోవిందా నన్ను దయజూడు పాహిముకుంద ద ॥

అను పల్లవి:
దశముఖ సంహార ధరణిజపతి రామ
శశిధరపూజిత శంఖచక్రధర ద ॥

చరణము(లు):
మీపాదములే గతిమాకు మమ్మేలుకోస్వామి పరాకు
మాపాలగలిగిన శ్రీపతి యీప్రొద్దు కాపాడిరక్షించు కనకాంబరధర ద ॥

నారాయణ వాసుదేవ నిను నమ్మితి మహానుభావ
గరుడగమన హరి గజరాజరక్షక పరమపురుష భక్తపాపసంహరణ ద ॥

తారక నామమంత్రము రామదాసులకెల్ల స్వతంత్రము
ఇరవుగ కృపనేలు యిపుడు భద్రాద్రిని స్థిరముగ నెలకొన్న సీతామనోహర ద ॥

Other Ramadasu Keerthanas:

See Also  Gopijana Vallabha Ashtakam 1 In Telugu